Monday, June 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించాలి

ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించాలి

- Advertisement -

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను వెంటనే మెరుగుపరచాలని, అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ ఏబీవీపీ కార్యదర్శి బత్తుల రాజు డిమాండ్ చేశారు. సోమవారం ఎంఈఓ కార్యాలయంలో నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ జూన్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ముందుగానే కల్పించాలని పేర్కొన్నారు.  పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రపరచడంతో పాటు అవసరమైన చోట కొత్త సౌచాలయాల నిర్మాణం చేపట్టాలని కోరారు.  అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా పుస్తకాలు విక్రయిస్తూ, అధిక ఫీజులు వసూలు చేసి తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని అన్నారు.

విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చి విద్యను వ్యాపారంగా నిర్వహించడం దురదృష్టకరమని, అనేక ప్రైవేట్ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు, ఆట స్థలాలు, పార్కింగ్ సదుపాయాలు లేకపోయినా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఇటువంటి పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హుస్నాబాద్  ఉపాధ్యక్షులు సంతోష్,అంజి,నగర సంయుక్త కార్యదర్శులు రంజిత్,చరణ్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -