Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బషీరాబాద్ లో ఉపాధ్యాయుల బడిబాట

బషీరాబాద్ లో ఉపాధ్యాయుల బడిబాట

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని బస్సు గ్రామంలో స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులను కలిశారు. అన్ని వసతులు కలిగి ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని తమరి పిల్లల్ని చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులతో ఉత్తమ విద్యా బోధన జరుగుతుందని, ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలు ఉచితంగానే విద్యార్థులకు అందుతాయని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించడం ద్వారా ఉత్తమ విద్యా బోధన అందుతుందన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల ద్వారా విద్యార్థులకు అందే సౌకర్యాలతో ముద్రించిన కరపత్రాలను  తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేష్, అంగన్వాడీ టీచర్ మంజుల, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -