Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి: సీపీఐ(ఎం) 

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి: సీపీఐ(ఎం) 

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్ 
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరుపేదలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సీపీఐ(ఎం)  జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని రూరల్ మండలం ఖానాపూర్ గ్రామంలో పేద ప్రజలు రైస్ మిల్లులు, పసుపు మిల్లులలో, ఇతర పనులు చేస్తూ రోజు కూలీలతో బతుకుతున్న వారు అనేకసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వం కానీ, నేటి ప్రభుత్వం కానీ నిరుపేదలైన వారికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో సరైన కూలీ దొరకక ఆర్థిక ఇబ్బందులతో పేదలు అప్పుల పాలవుతున్నారని తెలిపారు.

వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ఇండ్ల స్థలం లేని వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రాబోయే కాలంలో పేదల తోటి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం)  నగర కార్యదర్శి సుజాత నగర కార్యదర్శి వర్గ సభ్యులు నల్వాల నరసయ్య నగర నాయకులు ఉద్ధవ్, శంషుద్దీన్ ,నిరుపేదలు గణేష్, లక్ష్మి, సరస్వతి, గంగమ్మ, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -