Saturday, June 13, 2026
E-PAPER
Homeఆటలుఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ చారిత్రక విజయం

ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ చారిత్రక విజయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ చారిత్రక విజయం సాధించింది. ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘనిస్థాన్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ చేతులెత్తేసింది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126), కేఎల్ రాహుల్ (100) సెంచరీలతో 8 వికెట్లకు 564 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ కేవలం 152 పరుగులకే ఆలౌట్ అయింది. భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 6 వికెట్లతో సత్తా చాటడంతో ఆఫ్ఘన్ ఫాలో-ఆన్ ఆడాల్సి వచ్చింది.

ఫాలో-ఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్, కేవలం 35.5 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ (4 వికెట్లు), కుల్దీప్ యాదవ్ (3 వికెట్లు) ఆఫ్ఘన్ పతనాన్ని శాసించారు. వారికి పేసర్ మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్‌తో సహకరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘన్ ఓపెనర్లు తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించి కాస్త ప్రతిఘటించినా, సిరాజ్ వికెట్ తీయడంతో వారి పతనం ప్రారంభమైంది. లంచ్ తర్వాత కేవలం 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పూర్తిగా ఓటమిని ఖాయం చేసుకుంది. గాయం కారణంగా ఆఫ్ఘన్ ఆటగాడు షరఫుద్దీన్ అష్రఫ్ బ్యాటింగ్‌కు రాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -