నవతెలంగాణ-హైదరాబాద్: గత నెల 3న నిర్వహించిన నీట్ పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే. రాజస్థాన్ లో పేపర్ లీక్ కారణంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ((National Testing Agency)) రద్దు చేసింది. అదే విధంగా జూన్ 6న కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీక్‌ను వ్యతిరేకిస్తూ, కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేయాలని జంతర్ మంతర్ పెద్ద యోత్తున్న ధర్నా కూడా చేశారు. తాజాగా కేంద్ర విద్యాశాఖ, NTA కీలక నిర్ణయం తీసుకున్నాయి. నీట్ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్లకు లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరోసారి పేపర్ లీకేజీ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ కఠిన నిర్ణయంతో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
లాక్ డౌన్ పరీక్ష పూర్తయ్యేలోపు కొనసాగనుంది. అంటే జూన్ 21న పరీక్ష పూర్తయ్యేలోపు అజ్ఞాతంలోనే ఉండాల్సి వస్తుంది.
లాక్ డౌన్ లో ఉన్న అధ్యాపకులకు ఫోన్ తో పాటు.. ఇంటర్నెట్ సదుపాయం లాంటివి ఏవీ ఉండవు. వారి దగ్గరికి వచ్చి పోయేవారిని ఎల్లప్పుడూ కెమెరా నిఘాలో పర్యవేక్షిస్తుంటారు. కేవలం ప్రభుత్వం అనుమతించిన వారినే వారి దగ్గరకు ప్రవేశం ఇస్తారు.



