- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ బి.వి. నాగమోహన్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ డీఎంఈ నుంచి ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు అందాయి. నగరంలోని మెడికల్ కళాశాలలో ఫోరెన్సిడ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న నాగమోహన్కు ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం జీజీహెచ్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఈ సందర్భంగా ఆస్పత్రిని గాడిన పెట్టేందుకు ప్రణాళికతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయనను ఆకస్మికంగా గాంధీ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్‌గా బదిలీ చేస్తూ డీఎంఈ ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -



