నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని అమీర్ నగర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ఆవరణలో సోమవారం సర్పంచ్ నీలవేణి దశరథ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి సెలవుల నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రం ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఊడ్చి శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను తొలగించారు. తొలగించిన పిచ్చి మొక్కల్ని, చెత్తాచెదారాన్ని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీలవేణి దశరథ్ మాట్లాడుతూ వేసవి సెలవులు ముగిసి అంగన్వాడి కేంద్రాలు తెరుచుకొనున్న తరుణంలో కేంద్రాలకు విచ్చేసిన చిన్నారులకు సౌకర్యంగా ఉండేలా గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అంగన్వాడి కేంద్రం పరిశుభ్రంగా ఉంటే కేంద్రానికి విచ్చేసే చిన్నారులకు కూడా సౌకర్యంగా ఉంటుందన్నారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరు అంగన్వాడి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మలావతుపద్మశంకర్, పంచాయతీ కార్యదర్శి సంధ్య, వార్డు సభ్యులు తోట ప్రసాద్, పుప్పాల నరసయ్య, అంగన్వాడి టీచర్ భాగ్య, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది, పలువురు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రం ఆవరణలో శ్రమదానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



