Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయండి

దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయండి

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సవరించి 3 లక్షల కోట్లు ఉపాధి హామీకి కేటాయించి పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలీ 800 ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. మునిపల్లి మండల కేంద్రలోని గ్రామాలని బుధవారం పర్యటించి కూలీలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నర్సిములు మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి నిధులను తగ్గిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి బిబిజి రాంజీ చట్టాన్ని తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు.

రెక్కాడితే గాని డొక్కాడనటువంటి పేదలు పెరుగుతున్న ధరలను అడ్డుకొని కొనుక్కోనీ బ్రతకాలంటే రోజు కూలి 800 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి 95 వేల కోట్లు కేటాయించిందని అందులో పాత బకాయిలే వేల కోట్లు ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి పెట్టిన బడ్జెట్ ను సవరించి 3 లక్షల కోట్లు కేటాయిస్తే తప్ప ప్రజలకు ఉపాధి అందే పరిస్థితి లేదని అన్నారు.నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం తీసుకువచ్చి ఫోటోలు వస్తే తప్ప పేమెంట్ చేయనటువంటి పద్దతి రద్దు చేయాలని,వర్క్ ఐడి 500 మీటర్ల దూరంలోనే ఫోటోలు వస్తున్నాయని కచ్చితంగా మళ్ళీ ఫోటో కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. కూలీలందరికీ పనిముట్లు, టెంట్లు, మంచినీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సమ్మర్ అలవెన్స్ లను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని వీటిని వెంటనే పునరుద్ధరించాలని అన్నారు.

ఈ నెల ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కూలీలందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి హక్కులను సాధించుకోవాలని సమ్మెను జయప్రదం చేయాలని మండల ప్రజలకు పిలుపునిచ్చారు. ఉపాధి హామీలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి యాదయ్య, ఉపసర్పంచ్ పాండు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.రమేష్ గౌడ్, వ్యవసాయ కార్మిక జిల్లా సహాయ కార్యదర్శి డి.కుమార్, రాజు, శేఖర్, అశోక్, తుకారాం, గంగమ్మ, సుశీలమ్మ, శ్రీశైలం, గౌస్ తదితర గ్రామ కూలీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -