Friday, April 17, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా ఎల్లమ్మ బోనాలు..

ఘనంగా ఎల్లమ్మ బోనాలు..

- Advertisement -

 నవతెలంగాణ- జన్నారం : గత ఐదు రోజులుగా జన్నారం గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం రేణుక ఎల్లమ్మ బోనాలు నేటితో ముగిశాయి. మంగళవారం రాత్రి మహిళలు ఇంటికొక బోనం చొప్పున బోనాలను తీసుకొని వెళ్లి ఎల్లమ్మకు సమర్పించారు. బుధవారం ఆయన వద్ద బైండ్ల కులస్తుల చేత పట్నాలు వేసి మేకపిల్లను గావు పట్టారు. ఐదు రోజులు జరుగుతున్న బోనాల పండుగకు గౌడ కులస్తులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేశారు. బుధవారం ఆలయ సమీపంలోని తాటి చెట్టును 13 మంది గీతా కార్మికులకు ఎక్కి చెట్టు నుండి ఒకరి నుంచి ఒకరు కల్లు కుండా ను తీసి అమ్మవారికి సమర్పించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -