ప్రభుత్వ బడిలో తమ పిల్లలను చేర్పించి ఆదర్శంగా నిలిచిన బస్సాపూర్ సర్పంచ్, ఉప సర్పంచ్
నవతెలంగాణ-బాల్కొండ
వేల రూపాయల ఫీజులతో ప్రైవేట్ పాఠశాలల వైపు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో బాల్కొండ మండలంలోని బస్సాపూర్ గ్రామం ఆదర్శంగా నిలిచింది. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని గ్రామస్తులంతా సోమవారం గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ , ప్రభుత్వ బడులనే బలోపేతం చేయాలని ,.అప్పోసొప్పో చేసి.. వేల రూపాయలు చెల్లించి తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు. పేద మధ్య తరగతి అన్న తేడా లేకుండా ప్రైవేట్ పాఠశాలలకే జై కొడుతున్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు పంపితేనే తమ పిల్లల బతుకు మారుతుందని.. ప్రభుత్వ పాఠశాలలకు పంపితే పిల్లలకు చదువు రాదని.. క్రమశిక్షణ కోల్పోతారని అపనమ్మకంతో ప్రైవేట్ పాఠశాలలకు క్యూ కడుతున్నారు. కానీ అన్ని ఊర్లు ఒక లెక్క.. బస్సాపూర్ గ్రామంలో మాత్రం మరో లెక్క అంటున్నారు గ్రామస్తులు. ప్రైవేట్ పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ బడులే ముద్దు అంటూ పిలుపునిస్తున్నారు. ఊరు ఊరంతా ఒక్కటయి తీర్మానం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకే జై కొట్టి ఔరా అనిపించుకుంటున్న ఆ ఊరు గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిన గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ వంశీలను మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ గ్రామ సభలో సన్మానించారు.వారు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారన్నారు. గ్రామసభలో బడిబాట గురించి మండల విద్యాశాఖ అధికారి సుదీర్ఘ వివరణను ఇచ్చారు.
ప్రయోజనాలు: ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు, నాణ్యమైన విద్య, గురుకుల కోచింగ్, రకాల ఉపకార వేతనాలు, త్రిబుల్ ఐటీ నన్ను సీట్లు ,ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్ బుక్స్, అల్పాహారం, ప్రావిన్యులైన, ఉన్నతమైన విద్యార్హతలు గల, ఉపాధ్యాయులచే బోధన, ఫీల్డ్ ట్రిప్స్, విజ్ఞానం వినోద విహారయాత్రలు, అధునాతన సైన్స్ ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్ లు, ఐ .ఎఫ్. పి. ప్యానెల్ ద్వారా డిజిటల్ విద్యాబోధన, యూనిఫాం, మరియు మధ్యాహ్న భోజన పథకం, తదితర విషయాలపై గ్రామస్తులకు, తల్లిదండ్రులకు సుదీర్ఘ అవగాహన కల్పించారు కావున గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలని కోరారు. గ్రామంలో విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీ ఏర్పడి పాఠశాల అభివృద్ధికి ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశానికి హాజరై తమ యొక్క పిల్లల బాగోగులను తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ , ఉప సర్పంచ్ వంశీ, వార్డు సభ్యులు గ్రామాభివృద్ధి కమిటీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోయడ నరసయ్య, ఉపాధ్యాయ బృందం, వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.



