Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వార్డు సమస్యల పరిష్కారానికి సభలు కీలకం

వార్డు సమస్యల పరిష్కారానికి సభలు కీలకం

- Advertisement -

మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి
నవతెలంగాణ-వర్ధన్నపేట

మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సమస్యలు పరిష్కారానికి స్థానికంగా ప్రజలు సమస్యలు తెలపాలని పరిష్కారం కోసం వార్డు సభలు కీలకంగా ఉపయోగపడతాయని మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అన్నారు. 99 రోజుల ప్రజా పాలన- ప్రగతికి ప్రాణాలిక కార్యక్రమంలో భాగంగా12వ డివిజన్ లో ఎమ్మెల్యే ఆదేశానుసారం కౌన్సిలర్ తిరుపెల్లి వాణి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతికి ప్రాణాలిక కార్యక్రమంలో 12 డివిజన్ ప్రజలు తమ సమస్యలను తెలిపే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు.

గతంలో ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినా పనులు కాలేదనీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన ప్రజల వద్దకే అధికారులను ప్రజాప్రతినిధులను పంపి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో తిరుపల్లి కుమారస్వామి రాఖీ, కరుణాకర్( సానిటరీ ఇన్స్పెక్టర్ ) అనిల్( హెల్త్ అసిస్టెంట్) దీప్తి( వార్డు అధికారి ) రాజేందర్( వార్డు అధికారి) కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కే.రాకేష్, భూమా శ్రీకాంత్, నారెల్లి కమలాకర్, మోటో పోతుల మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -