Monday, June 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకొత్త ఫ్లైఓవర్ నిర్మాణ ప‌నుల‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాప‌న‌లు

కొత్త ఫ్లైఓవర్ నిర్మాణ ప‌నుల‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాప‌న‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హైదరాబాద్‌లో రూ.530 కోట్లతో మియాపూర్ చౌరస్తా నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు ఆరు లేన్లతో 1.8 కిలోమీటర్ల మేర ఈ కొత్త ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, నవీన్ యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మియాపూర్ చౌరస్తా నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు నిర్మించనున్న ఈ కొత్త ఫ్లైఓవర్ అంజయ్య నగర్ మీదుగా 1.8 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో నిర్మాణం జరగనుంది. రూ.530 కోట్లలో నిర్మాణానికి సంబంధించి రూ.330 కోట్లు, నిర్మాణానికి అవసరమైన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) కోసం మరో రూ.200 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. పరిపాలన అనుమతులు మంజూరు కావడంతో అధికారులు త్వరలోనే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించనున్నారు అధికారులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -