Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్లో గ్రామ సభ

కొయ్యుర్లో గ్రామ సభ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజా సమస్యల పరిస్కారం కోసమే ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోందని మండల ఎంపిడిఓ క్రాoతికుమార్ తెలిపారు.ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల  కార్యక్రమంలో భాగంగా ముగింపు గ్రామసభను కొయ్యుర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కొండ రాజమ్మ అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమంలోఎంపీడీవో క్రాంతి కుమార్, ఎస్ఐ-2 రాజన్ కుమార్,ఎంఈఓ లక్ష్మణ్ బాబు హాజరై మాట్లాడారు రానున్న వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ద్రవ,ఘన వ్యర్థాల నిర్వహణ,జల సంరక్షణ, పారిశుధ్యం,ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, వార్డు సభ్యులు,జీపీ సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -