Tuesday, June 9, 2026
E-PAPER
Homeసినిమామా నిజాయితీ ప్రయత్నానికి దక్కిన ఫలితమిది

మా నిజాయితీ ప్రయత్నానికి దక్కిన ఫలితమిది

- Advertisement -

రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈనెల 4న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్ష న్లతో విజయవంతంగా ప్రదర్శిత మౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘థాంక్ యూ’ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. రామ్ చరణ్ మాట్లాడుతూ,’ ప్రేక్ష కులు, అభిమానులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్యూ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇష్టపడి, ప్రేమిస్తూ ఒక పని చేస్తూ ఇంకా చెప్పాలంటే నాకు తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమను పొందడం సర్ప్రైజింగ్ గా వుంది. ఇది ఎవరో పుష్‌ చేస్తే చేసిన సినిమా కాదు. బుచ్చిబాబు చెప్పిన కథను నమ్మి ఈ సినిమా చేసినందుకు నాకు ఎంతో సంతృప్తిగా ఉంది. దేశ వ్యాప్తంగా, విదేశాల్లో కూడా ప్రతి రోజు సినిమా కలెక్షన్లు పెరుగు తుండటం, ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ పెరుగుతుండటం చూస్తు న్నాను. చాలా రోజుల తర్వాత ఫస్ట్ ప్రసాద్ ఐమాక్స్‌లో సినిమా చూశాను. అక్కడ మాస్ థియేటర్‌కు వచ్చేంత రియాక్షన్ కనిపించింది. నేను ఊహించని సన్నివేశాలకు కూడా చప్పట్లు కొట్టారు. సినిమా చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉందని చెబు తున్నారు. అలాంటి అనుభూతిని నాకు కలిగించిన మా టీమ్ అందరికీ ధన్యవాదాలు. నా సినీ లైబ్రరీలో నెంబరు 1, 2 గా నిలిచే సినిమా ఇది. మొదటిసారి కథ విన్నప్పుడు బుచ్చిబాబును హగ్ చేసుకున్నాను. కానీ ఇది ఎంత రిస్క్ అయిన కథ అనేది తర్వాత తెలిసింది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే, వాళ్లు ఈ సినిమాను స్వీకరించిన తీరు చూస్తుంటే, ఎవరైనా మనస్ఫూర్తిగా, నిజా యితీగా పని చేస్తే అది రేజర్ ఎడ్జ్ సినిమా అయినా, కమర్షియల్ సేఫ్ జోన్‌ సినిమా అయిన తప్పకుండా హిట్ కావాల్సిందే.

అలాంటి విజయాన్ని మాకు అందించిన భారతదేశంలోని, విదేశాల్లోని ప్రతి ప్రేక్షకుడికి మనస్ఫూర్తిగా ధన్య వాదాలుఅని అన్నారు. 'పెద్ది ఆడాడు... పోరాడాడు... గెలిచాడు. రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్లీ పోరాడాల్సి వచ్చింది. మళ్లీ గెలిచాడు. 300 కోట్లు, 400 కోట్లు అనేది పక్కన పెడితే, ఈ సినిమా ఎంత పెద్ద విజయం అనేది 300 రూపాయల టికెట్ కొన్న ప్రేక్షకుడే దాన్ని నిర్ణయిస్తాడు. ప్రేక్షకుల చేతిలో అంత పవర్ ఉంది. ఇది చాలా రేజర్ ఎడ్జ్ సినిమా. ఇలాంటి కథని నమ్మి రామ్ చరణ్ ఈ సినిమా చేయటం గ్రేట్ అని జగపతిబాబు చెప్పారు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్ట్ డుతూ,’ఒక మంచి కథను చెప్పాలనే ఉద్దేశంతో నేను, చరణ్ మీ ముం దుకు వచ్చాం. ఇది రెగ్యులర్ కమర్షి యల్ సినిమా కాదు. ఇది ఒక ఇన్‌స్పిరేషనల్ స్టోరీ, అలాగే జర్నీ కూడా. ప్రధాని మోదీ ప్రారంభిం చిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం కూడా నాకు ఒక స్ఫూర్తిగా నిలి చింది. గ్రామాల్లో ఉన్న యువకులు తలచుకుంటే దేశానికి పతకాలు తీసుకురాగలరని అది నిరూపిం చింది. భారతీయ జీవన విధానంలో ఆట ఒక భాగం. ఒక వ్యవస్థలో మనిషికి గుర్తింపు ఎంత ముఖ్యమో చెప్పాలనుకున్నాం` అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -