అనిల్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
ఆ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలి
మంత్రి బంధువు భూకబ్జాపై
కలెక్టర్‌కు సీపీఐ(ఎం) ఫిర్యాదు
నవతెలంగాణ-సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామ పరిధిలో అధికారం అండతో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన అనిల్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీపీఐ(ఎం) నాయకులు సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ.. ఖాదిరాబాద్ గ్రామ పరిధిలో సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో కొరివికుంట భూముల కబ్జాపై సమగ్ర విచారణ చేయాలన్నారు. కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి బంధువు కొరివికుంటతోపాటు చుట్టూ వందల ఎకరాలు భూకబ్జాకు పాల్పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవటం లేదన్నారు. పెద్ద పెద్ద రాళ్లు, కరెంట్ స్తంబాలు వేసి కబ్జా చేస్తుంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కేసులు ఎందుకు నమోదు చేయటం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వందల ఎకరాల భూములు కబ్జా అవుతుంటే 1.20 ఎకరాలు అని ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. కబ్జా చేసిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు నర్సిములు, నాగేశ్వరావు, రమేష్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
సింగూర్ బ్యాక్ వాటర్ కొరివికుంట భూముల కబ్జా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



