Thursday, February 12, 2026
E-PAPER
Homeజాతీయంఇకపై ముందుగా వందేమాతరం

ఇకపై ముందుగా వందేమాతరం

- Advertisement -

ఆ తర్వాతే జనగణమన : కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ : ఇకపై ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన ఆలపించడానికి ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బంకిం చంద్ర ఛటర్జీ రాసిన ఈ వందేమాతరం గేయంలో ఆరు చరణాలనూ పాడాలని ఆదేశించింది. జనవరి 28 తేదీతో విడుదలైన ఈ ఆదేశాల్లో జాతీయ గేయ ఆలాపనకు కొన్ని ప్రోటోకాల్స్‌ విధించింది. గేయంలోని ఆరు చరణాలను 3నిముషాల 10సెకన్లలో పూర్తి చేయాలని పేర్కొంది. అధికార కార్యక్రమాలు అంటే రాష్ట్రపతి వస్తున్నపుడు, త్రివర్ణపతాకాన్ని ఎగురవేసేటపుడు, గవర్నర్ల ప్రసంగాల సమయంలో ఈ గేయాన్ని ఆలపించాలని పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి.

జాతీయ గేయం, జాతీయ గీతం రెండూ పాడే సమయంలో లేదా ప్లే చేసే సమయంలో ముందుగా వందేమాతరాన్ని ఆలపించడం లేదా ప్లే చేయడం జరగాలని ఆ ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఆ సమయంలో అందరూ లేచి నిలబడాలని పేర్కొంది. అయితే న్యూస్‌రీల్‌ లేదా డాక్యుమెటరీ ప్రదర్శన సమయంలో భాగంగా జాతీయ గీతాలాపన వస్తుండగా, అప్పుడు లేచి నిలబడాలని భావించనక్కర లేదని అలా చేయడం వల్ల ఆ ప్రదర్శనకు ఆటంకం కలుగుతుంది. పైగా జాతీయ గేయానికి గౌరవం బదులు గందరగోళం ఏర్పడుతుందని ఆ ఉత్తర్వులు పేర్కొన్నాయి. జాతీయ గేయం ఆలాపనతోనే పాఠశాలలో తరగతులు ఆరంభమవ్వాలి. వందేమాతరం 150వ వార్షికోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. జాతీయ గేయాన్ని పాడే అన్ని సందర్బాల్లోనూ అధికార వర్షన్‌ను మాత్రమే ఆలపించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -