– లేబర్ కోడ్‌లు కావవి..
– బానిసలుగా మార్చే లీగల్ డాక్యుమెంట్లు
– కార్మిక సమ్మె వేతనాల కోసం కాదు. దేశాన్ని రక్షించడానికి చేసే పోరాటం : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కేవలం కార్మిక వ్యతిరేకమైనవి మాత్రమే కావని, కార్మికులను కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మార్చే లీగల్ డాక్యుమెంట్లు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విమర్శించారు. గురువారం జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా తూర్పు ఢిల్లీలోని జిల్మిల్ ఇండిస్టియల్ ఏరియాలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఎంఏ బేబీ ప్రసంగించారు. అనేక దశాబ్ధాల పోరాటం ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దుచేసి, వాటిస్థానంలో కార్మికుల హక్కులను అణచివేయడానికి వాటి స్థానంలో ఈ నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని విమర్శించారు. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలను కేంద్రం బలహీన పర్చడం ద్వారా పదవీ విరమణ చేసిన, అనారోగ్య కార్మికులు తమను తాము రక్షించుకోవాల్సి వస్తుందని బేబీ తెలిపారు. అలాగే, కార్మికుల పని గంటలను 12 గంటలకు పెంచే ప్రణాళికలు ఉన్నాయని, ఇది అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను ఉల్లంఘించడమేని విమర్శించారు. పని గంటల పెంపు కార్మికుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని, ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ్ రోజులకు వెనక్కి వెళ్లడమేనని విమర్శించారు.
గురువారం జరిగే సమ్మె కేవలం వేతనాల పెంపు కోసం జరిగే పోరాటం కాదని, దేశాన్ని రక్షించడానికి, కార్మికుల గౌరవాన్ని పునరుద్ధరించడానికి జరిగే పోరాటమని ఎంఏ బేబీ స్పష్టం చేశారు. తూర్పు ఢిల్లీలోని అన్ని ఇండిస్టియల్ ఏరియాల్లోని కార్మికులంతా తమ పనిముట్లను కిందకు దించి ఈ సమ్మెను చారిత్రాత్మకంగా మార్చాలని బేబీ పిలుపునిచ్చారు.
సమ్మెను సక్సెస్ చేద్దాం
- Advertisement -
- Advertisement -



