- Advertisement -
– పురుషులు 60.77 శాతం..
– మహిళలు 46.27 శాతం పాస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టెట్ ఫలితాల్లో 51.37 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 60.77 శాతం మంది పురుషులు ఉత్తీర్ణులు కాగా మహిళలు 46.27 శాతం పాస్ అయ్యారు. వర్గాల వారీగా చూస్తే బీసీలు 48.82 శాతం మంది, ఎస్సీలు 69.68 శాతం, ఎస్టీలు 54.28 శాతం, జనరల్ అభ్యర్థులు 31.14 శాతంతో మొత్తంగా 51.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇన్ సర్వీస్ అభ్యర్థుల్లో పేపర్ -1లో 77.04 శాతం, పేపర్ 2 (మ్యాథ్స్)లో 49.13 శాతం, పేపర్ 2 (సోషల్)లో 40.72 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఇతరుల్లో పేపర్ 1లో 69.22 శాతం, పేపర్ 2 (మ్యాథ్స్)లో 38.99 శాతం, పేపర్ 2 (సోషల్ )లో 33.64 శాతం పాస్ అయ్యారు.
- Advertisement -



