రూ.1200 కోట్లతో ‘పౌలోమి ఫ్లోరిక్’ ప్రారంభం
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాణ సంస్థ పౌలోమి ఎస్టేట్స్ కొత్తగా బెంగుళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు తెలిపింది. అక్కడ తన సరికొత్త లగ్జరీ ప్రాజెక్ట్ పౌలోమి ఫ్లోరిక్‌ను ప్రారంభిస్తున్నట్టు బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ రావు వెల్లడించారు. సుమారు 8.86 ఎకరాల విస్తీర్ణంలో రూ.1200 కోట్ల భారీ వ్యయంతో ఈ హైరైజ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీని నిర్మిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పర్యావరణ హితంగా, ఐజీబీసీ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో విశాలమైన 3 బిహెచ్‌కె ఫ్లాట్లు, అద్భుతమైన ల్యాండ్‌స్కేపింగ్, ఆధునిక వెంటిలేషన్ సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆ సంస్థ చీఫ్ సేల్స్ ఆఫీసర్ సంజరు కుమార్ ఝా తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ప్రశాంత్ రావు, మారుతి రావు, ప్రీతం సిన్హా తదితరులు పాల్గొన్నారు.
బెంగళూరు మార్కెట్లోకి పౌలోమి ఎస్టేట్స్
- Advertisement -
- Advertisement -



