Thursday, February 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిష్పాక్షిక ఎన్నికలే వెబ్‌కాస్టింగ్‌ లక్ష్యం

నిష్పాక్షిక ఎన్నికలే వెబ్‌కాస్టింగ్‌ లక్ష్యం

- Advertisement -

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
శాంతిభద్రతల పరిరక్షణకు, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడానికి వెబ్‌కాస్టింగ్‌ ఎంతగానో సహాయపడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని అన్నారు. బుదవారం హైదరాబాద్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో వెబ్‌కాస్టింగ్‌ ప్రాముఖ్యతను డీజీపీ శివధర్‌రెడ్డి, మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ టీకే. శ్రీదేవి, సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ.కర్ణన్‌కు వివరించారు. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. వెబ్‌ కాస్టింగ్‌తో రిగ్గింగ్‌, దొంగ ఓట్లు వంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. యువతలో ఎన్నికల ప్రక్రియపై అవగాహన, ఓటర్లలో విశ్వాసం కలుగుతుందనీ, ఫలితంగా ఓటింగ్‌ శాతం పెరుగుతుందని అన్నారు.

సుదర్శన్‌ రెడ్డితో భేటీ
మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ రోజు హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌ ఎన్నికల సంఘం కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డితో రాణి కుముదని భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సాంకేతికత వినియోగంపై చర్చించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 100 శాతం వెబ్‌ కాస్టింగ్‌ అమలు చేస్తున్న విధానాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల్లో జరిగే ప్రతి కదలికను జిల్లా స్థాయి కంట్రోల్‌ రూమ్‌, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారా లేదా అని సీఈవో సుదర్శన్‌ రెడ్డి, రాణి కుముదినిని అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -