నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లో చేరండి నాణ్యమైన విద్యను పొందండి అంటూ మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతి,ఉపాధ్యాయులు మంగళవారం కాపురంపల్లి,ఎస్సికాలని,లక్ష్మీ నగర్ లో బడిబాట కార్యక్రమాన్నీ చేపట్టి ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు మానవ విలువలు కలిగి ఉండే చదువును పొందే అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందన్నారు. పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత పొందడం మన గ్రామానికి గర్వకారణమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఉచితంగా దుస్తులు పుస్తకాలు మధ్యాహ్న భోజనము వీటితోపాటు బ్యాగు టై బెల్టు షూస్ తో కూడిన 9 వస్తువుల కిట్టు ను కూడా అందజేస్తారని తెలిపారు. అన్ని సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ పాఠశాలలోనే మన పిల్లల్ని చేర్పించి వారికి మంచి భవిష్యత్తును కల్పిద్దామని సమావేశానికి హాజరైన గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేరండి.. నాణ్యమైన విద్య పొందండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



