నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో గత ఆదివారం జరిగిన లంబోర్గిని కారు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టుబాకో టైకూన్ కేకే మిశ్రా కుమారుడు శివమ్ మిశ్రా ను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఖరీదైన కారు ఢీకొని ఆరుగురు గాయాలతో ఆస్పత్రిపాలైన నాలుగు రోజుల తర్వాత ఈ అరెస్ట్ జరిగింది.
గత ఆదివారం మధ్యాహ్నం వేగంగా వచ్చిన లంబోర్గిని కారు ఝూలా పార్కు దగ్గర ముందుగా ఆటోరిక్షాను, బుల్లెట్ బైకును ఢీకొని.. ఆ తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది శివమ్ కాదని, డ్రైవర్ మోహన్ యాదవ్ అని శివమ్ తండ్రి కేకే మిశ్రా చెప్పారు. డ్రైవర్ మోహన్ యాదవ్ కూడా తానే డ్రైవ్ చేశానని ఒప్పుకున్నాడు.



