నవతెలంగాణ – నవాపేట్ : దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను నవాపేట్ మండలం కేంద్రంలో సీఐటీయూ అధ్యర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేసి ర్యాలీ నిర్వహించడం జరిగిందని సీఐటీయూ నాయకులు ప్రశాంత్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశా వర్కర్స్ లకు కనీసం వేతనం నెలకు 26000 ఇవ్వాలని అన్నారు. 2022 నుండి పెండింగ్ లో ఉన్న కనీస వేతన జీఓని సవరించాలి. ఈఎస్ఐ, బోనస్ పీఎఫ్ లపై ఉన్న సిలింగ్ లను ఎత్తివేయాలని అన్నారు ప్రతి నెల 7వ తేదీ లోపు జీతాలు చెల్లించాలని తెలిపారు.విద్యుత్ చట్టం 2025 వెనక్కి తీసుకోవాలని తెలిపారు. జాతీయ విత్తన బిల్లు 2025 ను రద్దు చేయాలని తెలిపారు. రైల్వేలతో సహా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన మానుకోవాలని వారు తెలిపారు. అందరికీ సార్వత్రిక నాణ్యమైన ఆరోగ్యం విద్యను అందించాలి. జాతీయ విద్యా విధానం 2020ను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సాయి భవాని కార్మికుడు గోనెల రాములు, నిర్మల, పాల్గొన్నారు.
కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



