ఇరాన్‌ను కోరిన ఐఏఈఏ
న్యూయార్క్ : సంవత్సరం క్రితం అమెరికా-ఇజ్రాయిల్ బాంబు దాడులు జరిపిన ప్రదేశాలలో తనిఖీలు చేసేందుకు సహకరించాలని, అందుకోసం తమతో తిరిగి సంప్రదింపులు జరపాలని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ఇరాన్‌ను కోరింది. తనిఖీలకు సంబంధించి సంస్థ బోర్డులో తీర్మానం చేయాలంటూ అమెరికా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఐఏఈఏ అధిపతి రాఫెల్ గ్రొస్సీ ఈ మేరకు ఇరాన్‌కు సూచనలు చేశారు. అమెరికా-ఇజ్రాయిల్ బాంబు దాడులకు గురైన అణు కేంద్రాలకు ఏ మేరకు నష్టం జరిగిందో, వాటిలోని అణు పదార్థం పరిస్థితి ఏమిటో, శుద్ధి చేసిన యురేనియం ఎక్కడ ఉన్నదో ఇరాన్ ఇప్పటి వరకూ ఐఏఈఏకు తెలియజేయలేదు. బాంబు దాడులలో యురేనియం శుద్ధి కేంద్రాలు ధ్వంసమైనప్పటికీ లేదా బాగా దెబ్బ తిన్నప్పటికీ అత్యంత శుద్ధి చేసిన యురే నియంలో అధిక భాగం అలాగే ఉన్నదని నిపుణులు భావిస్తున్నారు. దీనిపై మనం సంప్రదింపులు జరపడం చాలా ముఖ్యం’ అని గ్రొస్సీ ఐఏఈఏ గవర్నర్ల బోర్డు త్రైమాసిక సమావేశంలో చెప్పారు. భద్రతా చర్యలను పూర్తి స్థాయిలో, సమర్ధవంతంగా అమలు చేయడానికి తమతో నిర్మాణా త్మకంగా సహకరించాలని ఇరాన్‌ను కోరా నని ఆయన ఓ లిఖితపూర్వక ప్రకటనలో తెలిపారు. బాంబు దాడులకు గురి కాని ప్రదే శాలను తనిఖీ చేసిన ఐఏఈఏ, ఫిబ్రవరిలో సైనిక దాడులు ప్రారంభం కావడంతో భద్రతా కారణాల రీత్యా వాటిని నిలిపి వేసింది. ఆ తర్వాత కేవలం బుషెహర్‌లోని విద్యుత్ ప్లాంటును మాత్రమే తనిఖీ చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి, ఇతరులతో అడ పాదడపా సంప్రదింపులు జరుగుతున్న ప్పటికీ సమాచార మార్పిడికి దారులు మూసుకుపోయాయని గ్రొస్సీ విలేకరులతో అన్నారు.
బాధితులను బాధ్యుల్ని చేస్తారా : ఇరాన్
ఈ వారం చివరలో జరిగే ఓటింగ్ కోసం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు బోర్డుకు ఓ ముసాయిదా తీర్మానాన్ని సమర్పించాయి. శుద్ధి చేసిన యురే నియంపై పూర్తి సమాచారాన్ని అందిం చాలని, దానిని ధృవీకరించ డానికి ఐఏఈఏకు పూర్తి సహ కారాన్ని అందించాలని ఆ ముసాయిదాలో ఇరాన్‌ను ఆదేశించారు. ఈ తీర్మానం బోర్డు ఆమోదం పొందే అవకాశం ఉంది. అయితే శాంతి చర్చలను అది సంక్లిష్టం చేయవచ్చు. కాగా ముసా యిదా తీర్మానం, అమెరికా దాడులపై ఇరాన్ మండిపడుతూ ‘అంతర్జాతీ యంగా చేపట్టే తప్పుడు చర్యలకు వ్యూహకర్తలే బాధ్యత వహించాలి తప్ప బాధితులు కాదు. దాడులకు పాల్పడిన వారిని బాధ్యులను చేయకుండా తప్పించడానికి బోర్డును ఓ సాధనంగా ఉపయోగించకూడదు’ అని తెలిపింది.



