Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం 

ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని దామెర భీమనపల్లి గ్రామంలో గురువారం పశుగణాభివృద్ధి సంస్థ నల్లగొండ వారి ఆధ్వర్యంలో ఉచిత గర్భ కోశ చికిత్స శిబిరం నిర్వహించారు. శిబిరంలో భాగంగా గేదెలకు గర్భకోశ చికిత్సలు నిర్వహించారు.అదేవిధంగా ఎదకురాని 50 పశువులకు చూడి పరీక్షలు నిర్వహించి,60 దూడలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జిల్లా అలివేలు కృష్ణయ్య మాట్లాడుతూ ఆవులు,గేదెల ఎదుగుదలకు గర్భ కోశ చికిత్సలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఆవులు, గేదెలు, గొర్రెలకు వచ్చే పలు రకాల రోగాలకు వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్సలు చేయించుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ సురేందర్,గోపాలమిత్ర సూపర్వైజర్ డాక్టర్ ప్రసాద్,గోపాలమిత్రలు ప్రసాదరావు,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -