Thursday, February 12, 2026
E-PAPER
Homeఆదిలాబాద్రోబోటిక్స్ పోటీలలో స్టేట్ ర్యాంక్ సాధించిన స్లేట్ విద్యార్థులు

రోబోటిక్స్ పోటీలలో స్టేట్ ర్యాంక్ సాధించిన స్లేట్ విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
ఈ బాట్ ప్లస్ ఇన్నోవిటి రోబోటిక్స్ ఛాంపియన్ షిప్ 2025-26 పోటీలలో మండల కేంద్రంలోని స్లేట్ ఎక్సలెన్స్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించారని స్లేట్ విద్యాసంస్థల చైర్మన్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ పోటీకి సంబంధించిన ఆన్లైన్ పరీక్ష జనవరి 10 వ తేదీన నిర్వహించగా స్లేట్ ఎక్సలెన్స్ స్కూల్ 7వ తరగతి కి చెందిన విద్యార్థులు శౌర్య,శ్రేయస్,వైభవ లు అత్యత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించి రూ.5000 నగదు బహుమతి అందుకున్నారు.

ఈ సందర్భంగా స్లేట్ విద్యాసంస్థల ఛైర్మెన్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులను చదువుతోపాటు సాంకేతిక రంగాలలో రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో తీర్చిదిద్దడమే స్లేట్ విద్యాసంస్థల లక్ష్యమని భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించి కన్న తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు,విద్య నేర్పిన గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులను తీర్చిదిద్దిన & ఈ బాట్ ఇంచార్జి ఉపధ్యాయురాలు శ్రావణి తో పాటు విద్యార్థులను ఛైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ శిరీన్ ఖాన్, ఉపాధ్యాయులు జాకీర్ ,అస్మా ,తల్లిదండ్రులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -