Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
గురువారం రూరల్ ఎమ్మెల్యే డా, భూపతిరెడ్డి జన్మదినం పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యులు, గ్రామ శాఖ నాయకులు, కాంగ్రేస్ పార్టీ మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేకులు కట్ చేసి, ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.

నేడు తమ ప్రియతమా నాయకుని జన్మదిన సందర్బంగా గ్రామాల్లో ఎక్కడ చూసిన ఆపండుగ వాతావరణం నెలకొని ఉండటం కనిపించింది. గ్రామాల్లో సంబరాలు జరుపుకున్నారు అనంతరం కాంగ్రేస్ నాయకులు అందరు కలిసి, మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ ఆదేశాల అనుసారం అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు,వార్డు సభ్యులు, కార్యకర్తలు,పెద్ద సంఖ్యలో మండల కేంద్రములోని మేజర్ మంచాయతీ వద్ద గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద కేకును కట్ చేసి ఘనంగా సంబారాలు జరిపారు.

టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణి చేశారు. కార్యక్రమములో ఆయా గ్రామాల సర్పంచులు, రాజేందర్, జోగినిపల్లి శేఖర్ గౌడ్, నిరడి రమేష్, మాలవత్ రమేష్, మధు, గాదె నరేష్, పిప్పర ప్రతాప్ గౌడ్, మాలవత్ బాలు నాయక్, ఎస్బి తండా రమేష్, దావజీ నాయక్, రొండ్ల గంగారెడ్డి, భగవంత్ రెడ్డి, సుభాష్ రెడ్డి, జాన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, చెలిమేల మల్లికార్జున్, వినయ్, అజయ్, శ్రీకాంత్, చక్రపాణి, అబ్దుల్ హమీద్, మనోహర్ రెడ్డి, డా, ఆనంద్, లక్ష్మణ్ నాయక్, నూత్పల్లి శంకర్, కట్టా గంగమోహన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -