– అటవీ రేంజ్ అధికారిణి అనిత
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని కమ్మర్పల్లి అడవి రేంజ్ అధికారిణి అనిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అటవీ రేంజ్ పరిధిలో వన మహోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ కొత్తపెళ్లి హారిక అశోక్ ప్రారంభించారు. అటవీ శాఖ సిబ్బంది, గ్రామస్తులతో కలిసి ఆమె మొక్కలు నాటారు.ఈ సందర్భంగా రేంజ్ అధికారిణి అనిత మాట్లాడుతూ అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని, అడవులను సంరక్షించడం మనందరి బాధ్యత అన్నారు.
ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. నేడు మనం నాటిన మొక్కలే వృక్షాలై భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువును అందిస్తాయన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు మొక్కలు నాటాలి అన్నారు.అటవీ రేంజ్ పరిధిలో అనుమతులు లేకుండా చెట్లను నరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్, బీట్ అధికారి వరుణ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మల్యాల సుభాష్ గౌడ్, పసుపుల రాకేష్, ముద్రవేణి హన్మాండ్లు, సుంకరి మురళి, అటవీ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



