నవతెలంగాణ-ఆర్మూర్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ అసోసియేషన్ (ఆట) జులై 31 నుంచి ఆగస్టు రెండు వరకు నిర్వహించబోయే యూత్ కాన్ఫరెన్స్, ఎడ్యుకేషనల్ సెమినార్ కు ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీ భాషిత సుందర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరపున బుధవారం పట్టణంలోని నలంద నలంద హై స్కూల్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, పట్టణ వాస్తవ్యులు శీభాషత కరస్పాండెంట్, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ (ట్రస్మా) జిల్లా అధ్యక్షుడు సుందర్ సార్ కు ఆట తరఫున ఆహ్వానం రావడం గర్వంగా ఉందన్నారు. కార్క్రమంలో పాల్గొని, వారి యొక్క విలువైన సందేశం ఇవ్వాల్సిందిగా ఆటవారు సుందర్ సార్ ను కోరడం అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు భారత్చంద్ర మల్లయ్య, విద్య ప్రవీణ్ పవార్, రాష్ట్ర నాయకులు కాంతి గంగారెడ్డి, మానస గణేష్, మాజీ మండల అధ్యక్షులు నలంద ప్రసాద్, విద్య గోపి కృష్ణ, కోశాధికారి స్కాలర్స్ వేణు, సెయింట్ పాల్ బబ్లూ, జెంటిల్ కిడ్స్ ప్రకాష్,, లిల్లీ పుట్ రామక్రిష్ణ, శ్రీమోడల్ మల్లేష్, సిద్దార్థ గంగారెడ్డి, నలంద సాగర్ తదితరులు పాల్గొన్నారు.


