Wednesday, June 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలను పరామర్శించిన సునీల్ రెడ్డి

బాధిత కుటుంబాలను పరామర్శించిన సునీల్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బుధవారం పరామర్శించారు.గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ వల్ల నాన్న రాజన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. అదేవిధంగా గ్రామానికి చెందిన రమేష్ వాళ్ల నాన్న లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. మృతుల అనారోగ్యాలకు గల  కారణాలను వారి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, కిషన్ కాంగ్రెెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -