నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో బుధవారం పెద్దమోరి వద్ద అడ్డంకిగా ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ ను డిఇ స్వాతితో కలిసి ఈ ఈ కరుణాకర్ పరిశీలించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బీజన బాలమణి భాస్కర్ కూడా సమస్య గురించి అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..మిషన్ భగీరథ పైప్ లైన్ అడ్డంకితో వర్షపు నీరు రోడ్డుపై నుంచి ఇండ్లలోకి ప్రవహిస్తున్న విషయం మా దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమస్యను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. వర్షపు నీరు బయటకు రాకుండా పైప్ లైన్ ను అడ్జస్ట్ మెంట్ చేసి, సమస్య పునరావృత్తం కాకుండా చేస్తామని తెలిపారు. పైప్‌లైన్ సర్దుబాటు అనంతరం వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు.
మిషన్ భగీరథ పైప్ లైన్ అడ్డంకిని తొలగిస్తాం: ఈ ఈ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



