నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలంటే అన్నికంటే ముఖ్యం చదువు ఒక్కటే మార్గమని అందుచేతనే తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషసతీష్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం మున్సిపల్ పరిధిలోని వార్డు 8 కేఆర్కె కాలనీలో నిర్వహించిన వార్డు సభకు ఆమె ముఖ్య అధితిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కాలనీ వాసులు చైర్పర్సన్ కు వివిధ సమస్యలను విన్నవిస్తు దరఖాస్తులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల్లో అతిపెద్ద మురికివాడ కేఆర్.కే కాలనీ అని అన్నారు. ఇక్కడ సమస్యలు అనేకంగా ఉన్నాయని తమ దృష్టికి రావడంతో వీటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 9 ‘కోట్లతో వివిధ అభివృద్ధి పసుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించామన్నారు. ఆ నిధులు మంజూరైన వెంటనే కాలనీలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీటి సమస్యల పరిష్కరంవై తమ పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. అర్హులైన వేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రత్యేక అధికారిణి నిహారిక, వార్డు కౌన్సిలర్ నాగ్ సేన్, వార్డు ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.



