Thursday, June 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాల ప్రభుత్వాస్పత్రిని త్వరితగతిన అందుబాటులోకి తేవాలి: ఎమ్మెల్యే రేవూరి

పరకాల ప్రభుత్వాస్పత్రిని త్వరితగతిన అందుబాటులోకి తేవాలి: ఎమ్మెల్యే రేవూరి

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాలలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని అత్యాధునిక వైద్య పరికరాలు, మెరుగైన వసతులతో త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్‌పర్సన్, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ఆస్పత్రి అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పరకాల ఏరియా ఆస్పత్రి ద్వారా ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన వైద్య సేవలు అందాలని, వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా అనస్థీషియా వైద్యుడిని అందుబాటులో ఉంచాలని, అవసరమైన మందుల నిల్వలు నిరంతరం ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా రూ.79.18 లక్షల వ్యయంతో వైద్య పరికరాల కొనుగోలు, మౌలిక వసతుల కల్పనపై సమావేశంలో చర్చించారు.

ఈ క్రమంలో ఆస్పత్రి రికార్డులు, బిల్లుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహాన్‌పై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి రశీదు, బిల్లు, రికార్డు పారదర్శకంగా ఉండాలని, అభివృద్ధి పనులను ఏజెన్సీలు వేగవంతం చేయాలని ఆదేశించారు. గత నెలలో ఈ అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచి, ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరకాలలో అసంపూర్తిగా ఉన్న మార్కెట్ భవన నిర్మాణ పనులను సైతం త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, ఆర్డీవో డి.ఎస్. వెంకన్న, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -