Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలికపై లైంగికదాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

బాలికపై లైంగికదాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

- Advertisement -

నిందితుడిని కఠినంగా శిక్షించాలి: ప్రజా సంక్షేమ వేదిక మహిళా అధ్యక్షురాలు జన్ను జయ
నవతెలంగాణ – పరకాల 

జిల్లాలో చోటుచేసుకున్న అమానవీయ ఘటనపై ప్రజా సంక్షేమ వేదిక మహిళా అధ్యక్షురాలు జన్ను జయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, ఆ బాలికను ఐదో అంతస్తు నుంచి కిందకు తోసి హతమార్చాలని ప్రయత్నించిన కిరాతకుడు గౌస్ పాషాను కఠినాతి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటనపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో రోజురోజుకూ ఇలాంటి అవమానకరమైన ఘటనలు పునరావృతం కావడంపై జన్ను జయ ఆందోళన వ్యక్తం చేస్తూ, మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిని ఉపేక్షించకూడదని పేర్కొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించడం ద్వారానే ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం, అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -