Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్యదర్శి వాణి సేవలు మరువలేనివి: సర్పంచ్

కార్యదర్శి వాణి సేవలు మరువలేనివి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
మండల పరిధిలోని మేళాసంఘం పంచాయతీ కార్యదర్శి చింతలగట్టు వాణి బుధవారం బదిలీపై వెళుతున్నారు. ఈ క్రమంలో గ్రామపంచాయతీ ఆవరణలో వీడ్కోలు సమావేశాన్ని సర్పంచ్ కుపనగారం లక్ష్మీ సంగమేశ్వర్ ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉద్యోగులకు బదిలీలు సహజమే కానీ వారు గ్రామానికి చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఆమెకు జ్ఞాపికను అందజేసి, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు గౌరెడ్డి గారి నారాయణరెడ్డి, ఉపసర్పంచ్ బేగరి అంజయ్య, నాయకులు ఖ్యాతం రవీందర్, మాణిక్యప్ప, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -