Friday, June 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండిగ్రీ కళాశాలలకు యూజీసీ స్కేలు

డిగ్రీ కళాశాలలకు యూజీసీ స్కేలు

- Advertisement -

కొత్త కోర్సులు, 9 కొత్త సీఓఈలు, ల్యాప్‌టాప్‌లు, ఆర్థిక సాయం
టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ మూడవ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు
2017 తర్వాత మూడవ సమావేశం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన, ప్రపంచ స్థాయి విద్యనందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) మూడవ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం గురువారం హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని మంత్రి ఛాంబర్‌లో మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ విద్య, ఉపాధ్యాయ సంక్షేమం, ఉన్నత విద్య అవకాశాల విస్తరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను బోర్డు ఆమోదించింది. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేష్ ధోత్రే, బోర్డు ఆఫ్ గవర్నర్ కౌన్సిల్ సభ్యులు ప్రొఫెసర్ కాశీం, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) కంభంపాటి శారద, టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి సీతాలక్ష్మి, టీజీఆర్‌ఈఐఎస్ కార్యదర్శి డాక్టర్ జి. ఉషారాణి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి అభిలాష అభినవ్, ప్రొఫెసర్ డీఎస్‌ఆర్ రాజేందర్ సింగ్, ఓఎస్‌డీ వై.జె. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

​సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే…..
డిగ్రీ కళాశాలల నిర్వహణ కోసం ప్రత్యేక పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేయాలి
డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు యూజీసీ వేతన స్కేలు అమలుపై సానుకూలం
డిగ్రీ కళాశాలలకు న్యాక్ గుర్తింపు సాధించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
ఉన్నత విద్య కోసం దేశ, విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే ఎస్సీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఆర్థిక సహాయం అందించేందుకు ఆమోదం.
9వ తరగతి నుంచే నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు మరో 9 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించాలి.
క్రాఫ్ట్ టీచర్లు, ఆర్ట్ టీచర్లను టీజీటీలుగా గుర్తించే ప్రతిపాదనకు ఆమోదం.
సెలవు రోజుల్లో విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడేందుకు “ఫోన్ మిత్ర” సౌకర్యం ఏర్పాటు చేయాలి.
రాష్ట్ర కార్యాలయంలో భర్తీ చేసే పోస్టులకు రోస్టర్ విధానం అమలు చేయాలి
భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని డిగ్రీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను ప్రవేశపెట్టాలి
హైదరాబాద్‌లో టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ఆధ్వర్యంలో ఫార్మసీ కళాశాల స్థాపనకు సూత్రప్రాయ ఆమోదం.
గురుకుల విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఫౌండేషన్ సెంటర్లను బలోపేతం చేయడం, అదనపు సబ్జెక్ట్ నిపుణులను నియమించడం.
క్రీడలు, వృత్తి విద్య అభివృద్ధి కోసం స్పోర్ట్స్ కోచ్‌లు, వొకేషనల్ లెక్చరర్ల సేవలను కొనసాగించడం.
డిగ్రీ విద్యార్థుల్లో విద్యా ఏకాగ్రత పెంపు కోసం మొబైల్ ఫోన్ వినియోగంపై అమలులో ఉన్న నిబంధనలను కొనసాగించడం.
విద్యార్థుల పోషకాహార ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అన్ని గురుకులాల్లో ఉమ్మడి మెనూ విధానాన్ని అమలు చేయడం.
పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల పారితోషికాలను పెంచేందుకు ఆమోదం.
133 విద్యాసంస్థలకు సొంత భవనాలు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 133 గురుకుల విద్యాసంస్థలకు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టేందుకు సీఎంతో చర్చించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -