Tuesday, July 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘ఎయిర్‌పోర్టు’కు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరుపై హర్షం

‘ఎయిర్‌పోర్టు’కు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరుపై హర్షం

- Advertisement -

​కాంగ్రెస్‌ నాయకుల సంబరాలు
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌

​ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీ మేరకు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేశారని మాజీ ఎంపీ సోయం బాపూరావ్‌ అన్నారు. ఎయిర్‌పోర్టు భూ సేకరణ, ఇతర పనులకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2వేల 278 కోట్ల 14 లక్షల నిధులను మంజూరు చేశారు. దీంతో ఆదిలాబాద్‌లో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి డీసీసీ కార్యాలయం ఎదుట సంబరాలు జరిపారు. సీఎం రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌ అభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఎయిర్‌ పోర్టు భూసేకరణ, ఇతర పనుల నిమిత్తం వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారని చెప్పారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే ఎయిర్‌పోర్టు మంజూరు చేయించానని, అయితే గత ప్రభుత్వాలు పట్టించుకోని కారణంగా ఆలస్యం అవుతోందని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు సాజిద్‌ ఖాన్‌, ఆత్మ డివిజన్‌ చైర్మెన్‌ గిమ్మ సంతోష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ సంజీవ్‌రెడ్డి, అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్‌రెడ్డి, షాహిద్‌, ఖిజర్‌ పాషా, బండారి సతీష్‌ పాల్గొన్నారు.

​బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు
ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఎంపీ గోడం నగేష్‌, ఎమ్మెల్యే పాయల శంకర్‌ కృషి చేశారని, వారి చొరవ కారణంగా భూసేకరణ, ఇతర పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని బీజేపీ సీనియర్‌ నాయకులు జోగు రవి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన నాయకులు కలెక్టర్‌ చౌక్‌లో టపాసులు పెల్చి మిఠాయిలు పంచి పెట్టారు. ఈ సందర్భంగా జోగు రవి మాట్లాడుతూ.. అక్షర క్రమంలో మొదటిస్థానంలో ఉన్న ఆదిలాబాద్‌ అంటే అభివృద్ధి అని చూపేలా ఎంపీ గోడం నగేష్‌, ఎమ్మెల్యే పాయల శంకర్‌ పట్టుదలతో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కృషి చేశారని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంట జీవన్‌, ఆకుల ప్రవీణ్‌, పాయల శరత్‌, కృష్ణ, బోడిగం శ్రీకాంత్‌, సతీష్‌, రాకేష్‌, గటిక క్రాంతి, మహేందర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -