జల ఫిరంగులను ప్రయోగించిన పోలీసులు
డెర్రీ: ఉత్తర ఐర్లాండ్ భగ్గు మంటోంది. వలస వాద వ్యతిరేక నిరసనలు రెండో రాత్రి కూడా కొన సాగుతుండగా, ఆందోళన కారులపై పోలీసులు జల ఫిరంగులను ఉపయోగిం చారు. బెల్ఫాస్ట్‌కు ఉత్తరాన ఎనిమిది మైళ్ల దూరంలో ఉన్న న్యూటౌన్‌అబ్బే సమీపంలోని శాండీనోస్ రౌండ్‌అబౌట్ వద్ద నిరసన చేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీలు ఝుళిపిం చారు.డెర్రీ , కోలరైన్‌లో కూడా ఉద్రిక్తత నెలకొంది. ఉత్తర బెల్ఫాస్ట్‌లో జరిగిన కత్తి దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడిన తర్వాత, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని అల్లర్లు జరిగాయి. కత్తిపోటు బాధితుడైన స్టీఫెన్ ఓగిల్వీ కుటుంబం.. ఈ హింసాత్మక నిరసనలను ఖండించింది . తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేసింది. “సోషల్ మీడియాలో చాలా తప్పుడు సమాచారం ప్రచారం అవుతుండ టాన్ని మేం చూశాం. గాయాలైన బాధితుని పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. శాంతియుత నిరసన మాత్రమే సరైన మార్గమని మేము స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాము.” అని కుటుంబసభ్యులు తెలిపారు.
భగ్గుమన్న ఉత్తర ఐర్లాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



