Friday, February 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుచౌటుప్పల్ 16వ వార్డులో సీపీఐ(ఎం) ఘన విజయం

చౌటుప్పల్ 16వ వార్డులో సీపీఐ(ఎం) ఘన విజయం

- Advertisement -

— బత్తుల జయమ్మకు 374 ఓట్ల మెజారిటీ
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ గా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) అభ్యర్థి బత్తుల జయమ్మ శుక్రవారం ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు భార్య వెన్ రెడ్డి సంధ్యపై ఆమె 374 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బత్తుల జయమ్మకు 817 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి వెన్ రెడ్డి సంధ్యకు 443 ఓట్లు లభించాయి. వార్డులో మొత్తం 1,272 ఓట్లు ఉండగా 1,260 ఓట్లు పోలయ్యాయి. వాటిలో 9 ఓట్లు రిజెక్ట్ కాగా, 6 ఓట్లు నోటాకు నమోదయ్యాయి.

ఈ విజయం చౌటుప్పల్ మున్సిపాలిటీలో సీపీఐ(ఎం)కు పూర్వ వైభవం తిరిగి వచ్చినట్లు ఉందని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. గెలుపు సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు బాణాసంచాలు కాలుస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. విజయం అనంతరం బత్తుల జయమ్మ వార్డు ప్రజల వద్దకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంటింటికి వెళ్లి పాదాభివందనం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు గోశిక కరుణాకర్,రాగిరి కిష్టయ్య,ఎండి పాషా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ నాయకులు బండారు నరసింహ,బత్తుల దాసు బీఆర్ఎస్ నాయకులు జావిద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -