- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీ క్రీడాకారిణి చాన్ సు యుపై సింధు 21-6, 21-9 తేడాతో సునాయాస విజయం సాధించింది. ఈ అద్భుత ప్రదర్శనతో టైటిల్ వేటలో మరో అడుగు ముందుకేసిన సింధు, సెమీస్లో జపాన్ స్టార్ అకానే యమగుచితో తలపడనుంది.
- Advertisement -



