- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మూడేళ్లుగా కోమాలో ఉన్న థాయిలాండ్ యువరాణి బజ్రకితియాబా (47) కన్నుమూశారు. డిసెంబర్ 2022లో ఆమె స్పృహ కోల్పోయారు. గుండె పనితీరు రెగ్యులర్‌గా లేని కారణంగా ఆమె గుండె కండరాలకు మైక్రోప్లాస్మా ఇన్‌ఫెక్షన్ అయ్యింది. రాజు వజిరలాంగ్‌కార్న్ పెద్ద కుమార్తె అయిన ఆమె, లాయర్‌గా శిక్షణ పొంది, అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించారు. ఆస్ట్రియాకు రాయబారిగా పని చేశారు. 2021లో ఆమెకు జనరల్ హోదా లభించింది. ఆమె మృతి పట్ల థాయిలాండ్ రాచకుటుంబం తీవ్ర సంతాపం ప్రకటించింది.
- Advertisement -



