Friday, June 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పాల‌నలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే తోట

కాంగ్రెస్ పాల‌నలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకోడప్ గల్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి నేటి వరకు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి చేసిందని ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు అన్నారు. శుక్ర‌వారం పెద్దకొడప్ గల్ మండ‌లంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు చెక్కులు, ఇండ్ల ప‌ట్టాలు, ప‌లువురికి సీఎం రిలిప్ ఫండ్ చెక్కుల‌ను ఎమ్మెల్యే అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి లబ్దిదారునికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, ఇచ్చే బాధ్యత తనదే అన్నారు. పెద్ద కొడపగల్ మండలంలోని గ్రామాలలో నీటి సమస్యను నివార‌ణ‌కు 164 బోరు బావిలు బాగు చేసి నీటి సమస్యను పరిష్కరించామ‌ని తెలియ‌జేశారు. మండలంలో ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసి ఇచ్చే బాధ్యత త‌న‌దేన‌ని హామీ ఇచ్చారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మండలంలోనే 90 వేల క్వింటాల జొన్న పంటను కొనుగోలు చేశామ‌న్నారు.

గత ప్రభుత్వంలో రైతుల పంటలను సరిగ్గా కొనుగోలు చేయకుండా దళారులు రాజ్యం ఏలిందని విమ‌ర్శించారు. త‌మ ప్ర‌భుత్వం పాల‌న‌లో అక్రమాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక దిగుబడులు వచ్చే పంటలను రైతులు పండించే విధంగా కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు రెండు పడకల ఇండ్లు మంజూరులో సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. త‌మ పాల‌న‌లో స‌దురు ఇండ్ల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పించి స‌కాలంలో ఇండ్లు నిర్మాణాలు పూర్తి చేశామ‌న్నారు. అదే విధంగా మండలంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేయాల‌ని, కాటేపల్లి నుండి చిలర్జీ-శివపూర్ నుండి విట్ఠల్ వాడి గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామ‌స్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాల‌న‌లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్ర‌జ‌ల అభివృద్ధికి ఎమ్మెల్యే తొడ్పాటు అందించార‌ని, అభివృద్ధిలో రాజీప‌డ‌కుండా ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు విశేష కృషి చేశార‌ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్యామప్ప పటేల్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజా శేఖర్,ఎంపీడీఓ అభినవ్ చందర్,మండల పార్టీ అధ్యక్షుడు శ్యామప్ప పటేల్,సర్పంచులు విజయ్ లక్ష్మి,బాలాజీ పాటిల్,ఉత్తమ్ రావు,వినోద్ ఉప సర్పంచ్ నాగరాజు,పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి, మోహన్,నాగిరెడ్డి, పండరి,జాగుర్ సింగ్.ఇందిరమ్మ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -