Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల్లో ఓడినా.. గెలిచినా సీపీఐ(ఎం) ప్రజల పక్షమే

ఎన్నికల్లో ఓడినా.. గెలిచినా సీపీఐ(ఎం) ప్రజల పక్షమే

- Advertisement -

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులకు ఓట్లు వేసి సహకరించిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్  అన్నారు. ఎన్నికల్లో గెలిచినా  –  గెలవకపోయినా సీపీఐ(ఎం)ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

కార్మికులు, రైతులు, నిరుపేదల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు అనేక ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించామని, భవిష్యత్తులో  ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూ పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలుకావడానికి, కార్మిక – రైతు హక్కుల సాధన కోసం పార్టీ శ్రేణులు, ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు  మోతిరాం నాయక్, కొత్త నరసింహులు, ముదాం అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -