Saturday, June 13, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్రంపై పినరయి విజయన్ ఫైర్

కేంద్రంపై పినరయి విజయన్ ఫైర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్: గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో భారతీయ నౌక‌ల‌పై అమెరికా దాడి చేసిన విష‌యం తెలిసిందే.ఈ దాడిలో ముగ్గురు భారతీయ మ‌ర‌ణించారు. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై కేరళ ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దృఢమైన వైఖరిని అవలంబించడంలో విఫలమైందని ఆయన మండిప‌డ్డారు. ఈ మేరకు శ‌నివారం సోష‌ల్ మీడియా ఫేస్‌బుక్ వేదికగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

“గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించడం అత్యంత బాధాకరం,” అని విజయన్ పేర్కొన్నారు.” ఈ సమస్యపై స్పందన కేవలం నిరసన తెలపడానికే పరిమితం కాకూడదు,” అని ఆయన అన్నారు. అమెరికాను బాధ్యులను చేయాలని, ఆ ప్రాంతంలో సైనిక చర్యలకు ముగింపు పలికేలా ఒత్తిడి తీసుకురావాలని కూడా విజయన్ కేంద్రాన్ని కోరారు. “భారతీయ నావికుల మరణాలకు అమెరికా పూర్తి బాధ్యత వహించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలి’ అని ఆయ‌న రాసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -