Saturday, June 13, 2026
E-PAPER
Homeక్రైమ్గంజాయి మత్తులో లారీ డ్రైవర్ బీభ‌త్సం

గంజాయి మత్తులో లారీ డ్రైవర్ బీభ‌త్సం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాష్ట్రీయ సరిహద్దుల్లో గంజాయి మ‌త్తులో కెమికల్ ట్యాంకర్ డ్రైవ‌ర్ బీభ‌త్సం సృష్టించాడు.అతివేగంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తుల‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అశ్వారావుపేట ఏరియా హాస్పిటల్‌కి త‌ర‌లించారు. ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం రిఫర్ చేశారు. క్షతగాత్రులు ఏపీలోని దర్భగుడెం ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.

బైక్‌ను ఢీకొని లారీ డ్రైవ‌ర్ పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. స్థానికులు అప్ర‌మ‌త్త‌మైయి లారీని వెంబ‌డించారు. ఈక్ర‌మంలో స్థానికంగా ఉన్న క‌రెంట్ పోల్‌ల‌ను ఢీకొట్టి..పంట పొలంలోకి దూసుకెళ్లింది. గంజాయి మ‌త్తులో ఉన్న లారీ డ్రైవర్, క్లినర్‌ల‌ను ప‌ట్టుకొని పోలీసుల‌కు స‌మాచారం అందించారు.సంఘ‌ట‌న చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి పీఎస్‌కు త‌ర‌లించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -