తిరువీర్, ఐశ్వర్య రాజేష్ తొలిసారిగా ‘ఓ..! సుకుమారి’ అనే గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. చిత్ర బృందం తాజాగా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. హీరో తిరు వీర్ మాట్లాడుతూ, ‘ఫ్యామిలీస్, పిల్లలు కలిసి చూసిన సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది. అలాంటి సినిమాలకు లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి విజయమే ఈ సినిమాకు దక్కుతుంది. ఐశ్వర్య తో ఇది నా రెండో సినిమా. నాకు ఎప్పుడూ కథే ముఖ్యం కథ బాగుంటే సినిమా ఆడుతుంది. ఈ సినిమాలో కూడా కథ, కామెడీ, ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్‌తో బయటకు వస్తారుఅని అన్నారు. ''సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మిమ్మల్ని మళ్లీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆ సినిమా హిట్ అయిన తర్వాత నేను సైన్ చేసిన మొదటి సినిమా ఇదే. మహేశ్వర్ రెడ్డి అద్భుతమైన నిర్మాత. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. హీరోయిన్‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుందనే కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు రాలేదనుకుంటాను. ఈ సినిమా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ కలిసి థియేటర్లలో ఎంజాయ్ చేసే సినిమాఅని హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చెప్పారు. 'చాలా మంచి సినిమా తీశాం. ప్రేక్షకులు చూసి ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఉన్నాం అని నిర్మాత మహేశ్వర్ రెడ్డి చెప్పారు.
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్
- Advertisement -
- Advertisement -



