Sunday, June 14, 2026
E-PAPER
Homeఖమ్మంఫార్మర్ రిజిస్ట్రీ నమోదు తప్పనిసరి: ఏడీఏ

ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు తప్పనిసరి: ఏడీఏ

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
రైతుల వివరాలను ఒకే డిజిటల్ వేదికపై నమోదు చేసే కీలక వ్యవస్థ అయిన ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ మండలంలో కొనసాగుతోంది అని, రైతు పేరు, ఆధార్, భూమి వివరాలు, సాగు చేస్తున్న పంటల సమాచారం తదితర వివరాలు ఈ రిజిస్ట్రీలో నమోదు చేస్తారు అని వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు పెంటేల రవి కుమార్ అన్నారు. ఆయన ఆదివారం ఫార్మర్ రిజిస్టరీ దాని ఆవశ్యకతను నవతెలంగాణ తో పెంచుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ సంక్షేమ పథకాల అమలుకు ఈ డేటాబేస్ ఆధారంగా ఉపయోగపడుతుంది అన్నారు.

ఫార్మర్ రిజిస్ట్రీలో ఒకసారి సక్రమంగా నమోదు చేసుకున్న రైతులకు 11 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. దీనివల్ల రైతులకు లక్ష్యిత సేవలు అందించడంతో పాటు డూప్లికేట్ నమోదులు తగ్గి పారదర్శకత పెరుగుతుంది. వ్యవసాయ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతోంది. యూరియా యాప్ ద్వారా ఎరువుల పొందకం, పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సహాయం పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు తప్పనిసరి అని అధికారులు తెలిపారు.

నియోజకవర్గం లోని మండలాల వారీగా నమోదైన రైతుల వివరాల ప్రకారం మొత్తం 47,285 మంది రైతుల్లో 34,587 మంది నమోదు చేసుకోగా, 12,698 మంది రైతులు ఇంకా నమోదు చేసుకోవాల్సి ఉంది. మండల సగటు నమోదు శాతం 73 గా నమోదైంది.

మండలాల వారీగా చూస్తే అన్నపురెడ్డిపల్లి లో అత్యధికంగా 84 శాతం నమోదు పూర్తి కాగా, అశ్వారావుపేట మండలం 66 శాతంతో అత్యల్ప నమోదు నమోదైంది.చండ్రుగొండ లో 80 శాతం, దమ్మపేటలో 75 శాతం, ములకలపల్లిలో 70 శాతం నమోదు పూర్తైంది. ఇంకా నమోదు చేయని రైతులు సమీప వ్యవసాయ అధికారులను లేదా గ్రామ స్థాయి సిబ్బందిని సంప్రదించి త్వరితగతిన ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిరంతరాయంగా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -