ప్రధానిని ప్రశ్నించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ : అమెరికా వాణిజ్య ప్రతినిధి జమైసన్ గ్రీర్ భారత పర్యటనను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆత్మగౌరవం ఉన్న ఏ దేశమైనా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకు నేందుకు ఫోన్‌కాల్స్, పత్రికా ప్రకటనలకే పరిమితం కాదని, అంతకుమించి చేయా ల్సింది చాలానే ఉన్నదని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం అవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఒమన్ తీరంలో నౌకపై అమెరి కా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు చనిపోయిన ఘటనను ఆ సందర్భంగా గట్టిగా ఖండిస్తారా అని మోడీని ప్రశ్నిం చింది. ఈ నెల 12న విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో టెలిఫోన్ సంభాషణ జరిపినప్పుడు అమెరికా మంత్రి మార్కో రుబియో ఉపయోగించిన ‘ఆమోద యోగ్యం కాని, బెదిరింపు’ భాషను కూడా ట్రంప్ దృష్టికి తేవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రధానిని కోరారు.
నావికుల హత్యను ట్రంప్ దృష్టికి తెస్తారా ?
- Advertisement -
- Advertisement -



