నగర ఆత్మ ‘సాలార్ జంగ్ మ్యూజియం’: 75వ వార్షికోత్సవంలో భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏదైనా ఒక నగరం కొన్ని సంస్థలను నిర్మిస్తే, మరికొన్ని సంస్థలు ఆ నగర ఆత్మను నిర్మిస్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సాలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్ ఆత్మకు ప్రతిరూపమని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియం 75వ వసంతాల వేడుకలతోపాటు, మీర్ యూసుఫ్ అలీఖాన్ (సలార్ జంగ్-3) 137వ జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని ఒడిసిపట్టిన మహోన్నత వ్యక్తి సాలార్ జంగ్-3 అని గుర్తు చేశారు. ‘సాధారణంగా మనం మన కళ్ళజోడు, మొబైల్ ఫోన్, కార్ కీస్ లాంటి చిన్న వస్తువులనే మర్చిపోతుంటాం. కానీ సాలార్ జంగ్-3 ఏకంగా ప్రపంచ నాగరికతలనే భద్రపరిచారు. 43 వేల కళాఖండాలను సేకరించారు. అదీ కళలపై ఆయనకున్న అపారమైన భక్తి. ప్రపంచంలోని అరుదైన సౌందర్యాన్ని, చరిత్రను తన సొంత నిధుల నుంచి సేకరించారు. వాటన్నింటినీ ప్రజల ఆస్తిగా మార్చారు. ఈ మ్యూజియంలో హిందువుల కాంస్య విగ్రహాలు, పవిత్ర ఖురాన్ ప్రతిమలు, క్రైస్తవ మడోన్నా శిల్పాలు, బౌద్ధ కళాఖండాలు ఒకే చోట కొలువై ఉన్నాయి.
విష్ణుమూర్తి దశావతారాలు, ఖురాన్ శ్లోకాలు కలిసి ఉన్న ఆచార వస్తువులు ఇక్కడి ప్రత్యేకత. ఇది లౌకికత్వానికి సజీవ సాక్ష్యం. ఇదే దక్కన్ గంగా-జమునా తెహజీబ్’ అని గుర్తు చేశారు. మ్యూజియం పక్కనే ప్రవహించే మూసీ నది అంటే హైదరాబాద్ జ్ఞాపకాల ప్రవాహం అని అన్నారు. ఎన్నో ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన మూసీ నదిని ప్రక్షాళన చేసి, లండన్ లోని థేమ్స్, పారిస్ లోని సీన్ నది తరహాలో అంతర్జాతీయ స్థాయి రివర్ ఫ్రంట్‌గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సాలార్ జంగ్ మ్యూజియం కేవలం ఒక ఒంటరి భవనంగా కాకుండా అభివృద్ధి చెందిన మూసీ రివర్ ఫ్రంట్‌కు ఒక సాంస్కృతిక కిరీటంగా మారబోతోందన్నారు. పర్యాటకులు నది గుండా ప్రయాణిస్తూ, ఇక్కడి వారసత్వ వీధుల్లో నడుస్తూ, చారిత్రక కళాఖండాలను వీక్షించేలా ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ అంటే కేవలం చార్మినార్ మాత్రమే కాదు.. సైబర్ టవర్స్ నగరం కూడా అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ అంతే వేగంగా ఎదుగుతోం దన్నారు. బిర్యానీతోపాటు బయోటెక్నాలజీ, ఐటీ, ఫార్మా రంగాల్లో గ్లోబల్ పవర్‌హౌస్‌గా ఉన్నామని తెలిపారు. చార్మినార్, గోల్కొండ, కుతుబ్ షాహీ సమాధులు, చౌమహల్లా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లతో కూడిన ఓల్డ్ సిటీ హెరిటేజ్ సర్క్యూట్‌ను సలార్ జంగ్ మ్యూజియంతో అనుసంధానిస్తామన్నారు.
మెరుగైన రవాణా సౌకర్యాలు, నైట్ టూరిజం, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గైడెడ్ వాక్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వారసత్వం అనేది కేవలం గర్వపడటానికే కాదు.. స్థానిక గైడ్‌లు, కళాకారులు, హోటళ్లు, రవాణా రంగాల ద్వారా వేలాది మందికి జీవనోపాధి కల్పించడానికి ఉపయోగపడాలని చెప్పారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ వరకు ప్రతి విద్యార్థి ఈ మ్యూజియాన్ని సందర్శించి ‘ఇది నా ఆస్తి’అనే ఆత్మవిశ్వాసాన్ని పొందాలన్నారు. మ్యూజియం అనేది నిశ్శబ్దంగా ఉండే ప్రదేశం కాకూడదన్నారు. మ్యూజియం అనేది ప్రశ్నలతో సజీవంగా ఉండాలి. ఇందుకోసం పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌కు ఐటీ, బిజినెస్ పనుల మీద వచ్చే గ్లోబల్ ఇన్వెస్టర్లు కేవలం బోర్డ్‌రూమ్‌లకే పరిమితం కాకుండా.. కనీసం ఒక రోజు సాలార్ జంగ్ మ్యూజియాన్ని సందర్శించి, చార్మినార్ వద్ద ఇరానీ చాయ్ తాగి ఇక్కడి సంస్కృతిని ఆస్వాదించాలని సూచించారు. మన బిర్యానీ, హలీమ్, చాయ్ కేవలం ఆహార పదార్థాలు కావు.. తెలంగాణ సాంస్కృతిక ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభాలన్నారు, ఈ 75 ఏండ్ల ప్రయాణంలో మ్యూజియాన్ని కాపాడుకుంటూ వస్తున్న క్యూరేటర్లు, కన్సర్వేటర్లు, సెక్యూరిటీ, క్లీనర్లు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
ఏదైనా ఒక నగరం కొన్ని సంస్థలను నిర్మిస్తే, మరికొన్ని సంస్థలు ఆ నగర ఆత్మను నిర్మిస్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సాలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్ ఆత్మకు ప్రతిరూపమని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియం 75వ వసంతాల వేడుకలతోపాటు, మీర్ యూసుఫ్ అలీఖాన్ (సలార్ జంగ్-3) 137వ జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని ఒడిసిపట్టిన మహోన్నత వ్యక్తి సాలార్ జంగ్-3 అని గుర్తు చేశారు. ‘సాధారణంగా మనం మన కళ్ళజోడు, మొబైల్ ఫోన్, కార్ కీస్ లాంటి చిన్న వస్తువులనే మర్చిపోతుంటాం. కానీ సాలార్ జంగ్-3 ఏకంగా ప్రపంచ నాగరికతలనే భద్రపరిచారు. 43 వేల కళాఖండాలను సేకరించారు. అదీ కళలపై ఆయనకున్న అపారమైన భక్తి. ప్రపంచంలోని అరుదైన సౌందర్యాన్ని, చరిత్రను తన సొంత నిధుల నుంచి సేకరించారు. వాటన్నింటినీ ప్రజల ఆస్తిగా మార్చారు. ఈ మ్యూజియంలో హిందువుల కాంస్య విగ్రహాలు, పవిత్ర ఖురాన్ ప్రతిమలు, క్రైస్తవ మడోన్నా శిల్పాలు, బౌద్ధ కళాఖండాలు ఒకే చోట కొలువై ఉన్నాయి. విష్ణుమూర్తి దశావతారాలు, ఖురాన్ శ్లోకాలు కలిసి ఉన్న ఆచార వస్తువులు ఇక్కడి ప్రత్యేకత. ఇది లౌకికత్వానికి సజీవ సాక్ష్యం.
ఇదే దక్కన్ గంగా-జమునా తెహజీబ్’ అని గుర్తు చేశారు. మ్యూజియం పక్కనే ప్రవహించే మూసీ నది అంటే హైదరాబాద్ జ్ఞాపకాల ప్రవాహం అని అన్నారు. ఎన్నో ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన మూసీ నదిని ప్రక్షాళన చేసి, లండన్ లోని థేమ్స్, పారిస్ లోని సీన్ నది తరహాలో అంతర్జాతీయ స్థాయి రివర్ ఫ్రంట్‌గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సాలార్ జంగ్ మ్యూజియం కేవలం ఒక ఒంటరి భవనంగా కాకుండా అభివృద్ధి చెందిన మూసీ రివర్ ఫ్రంట్‌కు ఒక సాంస్కృతిక కిరీటంగా మారబోతోందన్నారు. పర్యాటకులు నది గుండా ప్రయాణిస్తూ, ఇక్కడి వారసత్వ వీధుల్లో నడుస్తూ, చారిత్రక కళాఖండాలను వీక్షించేలా ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ అంటే కేవలం చార్మినార్ మాత్రమే కాదు.. సైబర్ టవర్స్ నగరం కూడా అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ అంతే వేగంగా ఎదుగుతోం దన్నారు. బిర్యానీతోపాటు బయోటెక్నాలజీ, ఐటీ, ఫార్మా రంగాల్లో గ్లోబల్ పవర్‌హౌస్‌గా ఉన్నామని తెలిపారు. చార్మినార్, గోల్కొండ, కుతుబ్ షాహీ సమాధులు, చౌమహల్లా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లతో కూడిన ఓల్డ్ సిటీ హెరిటేజ్ సర్క్యూట్‌ను సలార్ జంగ్ మ్యూజియంతో అనుసంధానిస్తామన్నారు. మెరుగైన రవాణా సౌకర్యాలు, నైట్ టూరిజం, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గైడెడ్ వాక్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
వారసత్వం అనేది కేవలం గర్వపడటానికే కాదు.. స్థానిక గైడ్‌లు, కళాకారులు, హోటళ్లు, రవాణా రంగాల ద్వారా వేలాది మందికి జీవనోపాధి కల్పించడానికి ఉపయోగపడాలని చెప్పారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ వరకు ప్రతి విద్యార్థి ఈ మ్యూజియాన్ని సందర్శించి ‘ఇది నా ఆస్తి’అనే ఆత్మవిశ్వాసాన్ని పొందాలన్నారు. మ్యూజియం అనేది నిశ్శబ్దంగా ఉండే ప్రదేశం కాకూడదన్నారు. మ్యూజియం అనేది ప్రశ్నలతో సజీవంగా ఉండాలి. ఇందుకోసం పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌కు ఐటీ, బిజినెస్ పనుల మీద వచ్చే గ్లోబల్ ఇన్వెస్టర్లు కేవలం బోర్డ్‌రూమ్‌లకే పరిమితం కాకుండా.. కనీసం ఒక రోజు సాలార్ జంగ్ మ్యూజియాన్ని సందర్శించి, చార్మినార్ వద్ద ఇరానీ చాయ్ తాగి ఇక్కడి సంస్కృతిని ఆస్వాదించాలని సూచించారు. మన బిర్యానీ, హలీమ్, చాయ్ కేవలం ఆహార పదార్థాలు కావు.. తెలంగాణ సాంస్కృతిక ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభాలన్నారు, ఈ 75 ఏండ్ల ప్రయాణంలో మ్యూజియాన్ని కాపాడుకుంటూ వస్తున్న క్యూరేటర్లు, కన్సర్వేటర్లు, సెక్యూరిటీ, క్లీనర్లు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ జ్ఞాపకాల ప్రవాహం ‘మూసీ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



