రవితేజ హీరోగా నటిస్తున్న తన 77వ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’ని దర్శకుడు శివ నిర్వాణతో చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. మహా శివరాత్రి శుభ సందర్భంగా మేకర్స్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ప్రియా భవానీ శంకర్‌ను కావేరీగా పరిచయం చేశారు. శివ నిర్వాణ ఇంటెన్స్, ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ పవర్ఫుల్ కథని సిద్ధం చేశారు.
ముఖ్యంగా తండ్రి–కూతురు అనుబంధం ఈ చిత్రానికి హైలెట్‌గా ఉండబోతుంది. రవితేజ గత సినిమాల కంటే భిన్నంగా కొత్త ఎమోషనల్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ప్రతి పాత్రను బలంగా తీర్చిదిద్దారు. బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా నటిస్తుండగా, సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘ఇరుముడి’ షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
తండ్రీకూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో ‘ఇరుముడి’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



